స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాల భామ పూజా హెగ్డే ల కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సెన్సేషనల్ హిట్ మూవీ అలవైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన ఈ సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్, హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై అల్లు అరవింద్, సూర్యదేవర రాధాకృష్ణ కలిసి ఎంతో భారీ స్థాయిలో నిర్మించారు. 2020 సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ పెద్ద సక్సెస్ కొట్టడంతో పాటు అనేక ప్రాంతాల్లో మంచి కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది. లవ్, యాక్షన్, ఎమోషనల్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది.
కుష్బూ, జయరాం, సచిన్ ఖేడేకర్, అజయ్, సముద్రఖని, మురళి శర్మ తదితరులు ఇతర పాత్రలు చేసిన ఈ సినిమాకి పీఎస్ వినోద్ ఫోటోగ్రఫి అందించగా థమన్ సంగీతం అందించారు. ఇక ఈ మూవీలోని సాంగ్స్ అయితే ఏకంగా జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యాయి. ఇక ఈ సాంగ్స్ యువతతో పాటు ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుని హీరోగా అల్లు అర్జున్ కి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టిడం జరిగింది.

కాగా విషయంలోకి వెళితే, ఇటీవల ఈ సినిమాని హిందీలో డబ్ చేసి థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు సిద్దమైన గోల్డ్ మైన్ టెలీఫిల్మ్స్ వారు, ప్రస్తుతం ఈ సినిమా హిందీలో షెజాది పేరుతో రీమేక్ అవుతుండడంతో దానిని విరమించుకుని ఫిబ్రవరి 13న తమ అనుబంధ టివి ఛానెల్ దించాక్ టివిలో ప్రసారం చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇప్పటికే అలవైకుంఠపురములో హిందీ వర్షన్ టీజర్, ట్రైలర్ రెండు కూడా యూట్యూబ్ లో రిలీజ్ అయి ఆడియన్స్ నుండి మంచి స్పందన రాబట్టాయి. మరి తెలుగులో సూపర్ హిట్ కొట్టిన ఈ సినిమా త్వరలో నార్త్ ఆడియన్స్ నుండి ఎంత మేర క్రేజ్, రేటింగ్స్ దక్కించుకుంటుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: