పూరీ జగన్నాథ్ సినిమాలు చేసే విషయంలో ఎంత ఫాస్ట్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. పెరిగిన క్వాలిటీ దృష్ట్యా ఇప్పుడు ఆయన సినిమాలు చేసే విషయంలో కాస్త ఆలస్యం చేస్తున్నాడు కానీ అంతకు ముందు సంవత్సరానికి రెండు సినిమాలైనా విడుదల చేసే వాడు. ఆ విధంగా మంచి కథా కథనాలు తయారు చేసుకుని దానికి తగ్గట్లుగా నటీనటులను సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకుని చక చక షూటింగ్ పూర్తి చేసి అంతే ఫాస్ట్ గా రిలీజ్ చేయడం ఆయన విశేషం.

ఎక్కడా ఆలస్యం చేయకుండా మంచి అవుట్ పుట్ ను బయటకు తీసుకు వచ్చే ఈ దర్శకుడు ఇప్పుడు టాలీవుడ్ లో 22 ఏళ్ల పూర్తిచేసుకుని అరుదైన ఘనతను సాధించాడు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు గా పేరు సంపాదించుకున్న అదే సమయంలో ఎంతో మంది స్టార్ హీరోయిన్ లను కూడా సినిమా పరిశ్రమకు పరిచయం చేశాడు. ఈ 22 సంవత్సరాలలో ఎక్కువభాగం కొత్త హీరోయిన్ల తోనే ఆయన పని చేయడం విశేషం. ఆ విధంగా వారందరూ కూడా తమదైన టైం లో స్టార్ హీరోయిన్ గా తెలుగు సినిమా పరిశ్రమలో ఓ వెలుగు వెలిగారు.

ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా బద్రి సినిమాతో అమీషా పటేల్ మరియు రేణుదేశాయ్ ని పరిచయం చేశారు. ఆ తరువాత ఇడియట్ సినిమా తో రక్షితను, అమ్మ నాన్న తమిళమ్మాయి తో ఆసిన్, దేశ ముదురు సినిమా తో హన్సికను అలాగే 143 సినిమా తో సమీక్ష, చిరుత తో నేహాశర్మ, నేనింతే తో సియా గౌతం, ఇజం తో అదితి ఆర్య, పైసా వసూల్ తో ముస్కాన్, మెహబూబా తో నేహా శెట్టి, ఏక్ నిరంజన్ తో కంగనా రనౌత్, లోఫర్ తో దిశాపటాని వంటి టాప్ హీరోయిన్ లను ఆయన ఇండస్ట్రీ కి పరిచయం చేశాడు. ఏదేమైనా సినిమాలు తీసే విషయంలోనే కాదు హీరోయిన్లను పరిచయం చేసే విషయంలో తనకు మించిన వారు దర్శకులు లేరని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: