ప్రముఖ మలయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబుకు నటి అత్యాచార కేసు మెడకు చుట్టుకొని వదిలేలా కనిపించడం లేదు. కోర్టులో అతడు పెట్టిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను  కూడా నాయస్థానం కొట్టిపారేసింది.దీంతో ఈ హీరో ఖచ్చితంగా కోర్టులో హాజరు కాక తప్పదు.. ఇక ఒకవేళ హాజరు కానీ నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు. ప్రస్తుతం విజయ్ బాబు దుబాయ్ లో తలా దాచుకున్నాడని, ఇక అందుకే అతను కోర్టుకు హాజరుకాలేకపోయాడని అతని తరుపు న్యాయవాది చెప్పినా న్యాయస్థానం వెంటనే అతడిని కొచ్చికి వచ్చి కోర్టులో హాజరు కావాల్సిందిగా కోర్టు ఇక ఆదేశాలు జారీచేసింది. దీంతో విజయ్ బాబు రేపు అనగా బుధవారం నాడు కొచ్చిలొకి దిగుతాడని, వెంటనే అక్కడినుంచి కోర్టులో హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మే 30 వ తేదీన కేరళకు తిరిగి రాకుంటే అతని పిటిషన్ ను పరిగణనలోకి తీసుకోబోమని ఇప్పటికే స్పష్టం చేసిన కోర్టు బుధవారం నాడు ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న చర్చ సాగుతోంది.ఇక కోజికోడ్ కు చెందిన నటి ఏప్రిల్ 22 వ తేదీన కొచ్చిలోని ఒక ఫ్లాట్ లో ప్రముఖ నటుడు నిర్మాత విజయ్ బాబు తనపై అత్యాచారం చేశాడని నటి ఎర్నాకులంలోని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.



అవకాశం ఇస్తానని చెప్పి తనను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడని ఇంకా తనను లైంగికంగా వేధించే ముందు తనకు మత్తు పదార్థాలు ఇచ్చాడని కూడా ఆమె ఆరోపించింది.ఇక ఈ వార్త బయటికి వచ్చి పెద్ద సంచలనంగా మారిన సమయంలో విజయ్ తన సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతూ తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని ఇంకా ఆమె కావాలనే ఇదంతా చేస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ పై అభిమానులు విమర్శలు గుప్పించారు. తన తప్పేమి లేకపోతె కోర్టులో సరెండర్ అయ్యి పోరాటం చేయొచ్చు కదా.. అని కామెంట్స్  కూడా పెట్టారు. ఇక ఇలా నడుస్తున్న క్రమంలో ఎవరికి తెలియకుండా గత నెలలో విజయ్ బాబు దుబాయ్ కి పారిపోయాడు. అలాగే ఇక అక్కడి నుంచి జార్జియా వెళ్ళాడు. ఇలా విదేశాలు తిరుగున్న విజయబాబును మళ్లీ దుబాయ్ రప్పించడానికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం తెలుస్తోంది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. జార్జియా నుంచి దుబాయ్ కి వెళ్లి అక్కడ పోలీసులకు సరెండర్ అయ్యి.. అక్కడినుంచి కొచ్చి కి విజయ్ బాబు రావాల్సి ఉంది.. మరి ఈ కేసులో న్యాయస్థానం ఎలాంటి తీర్పుని ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: