నయనతార పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. తెలుగు , తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉంది..ఈమె చేస్తున్న అన్నీ సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో ఉండటంతో రెమ్యునరేషన్ కూడా భారీగా ఉంది. అయితే,ఈమె తో ఏ సినిమా సినిమా చేసిన భారీ హిట్ టాక్ ను అందుకుంటాయి.దాంతో ఎంత డబ్బులు ఇచ్చి అయిన సినిమా చెయ్యడం కోసం దర్సక నిర్మాతలు క్యూ కడుతున్నారు.. స్టార్ హీరోల సరసన నయన్ నటించింది.


అయితే, నయన్ పెళ్ళి మాత్రం వాయిదాలు పడుతూ వచ్చింది.మొత్తానికి తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి చేసుకొని ఓ ఇంటిది అయ్యింది.జూన్ 9 గురువారం నయన తార, విఘ్నేష్ శివన్‌ల వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహానికి కోలీవుడ్ ప్రముఖులతో పాటు, బాలీవుడ్ నుంచి షారూఖ్ ఖాన్ కూడా విచ్చేసిన సంగతి తెలిసిందే.మహా బలిపురంలోని ఓ ఆలయంలో అంగరంగ వైభవంగా నయన్, విఘ్నేష్ శివన్‌ల వివాహం జరిగింది.తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఈ జంట, వివాహానంతరం, తొలిసారిగా తిరుమలకు విచ్చేశారు. నయన్, విఘ్నేష్ శివన్ జంటను చూసేందుకు తిరుమలలో నయన తార అభిమానులు పోటెత్తారు. నయన తార పెళ్లి ఫోటోలూ, వీడియోలతో పాటు, ఇప్పుడీ తాజా పిక్స్ కూడా నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.



సాంప్రదాయ దుస్తుల్లో ఈ కొత్త జంట స్వామి వారిని దర్శించుకున్నారు. పసుపు పచ్చని పట్టుచీరలో నయనతార పెళ్లి కూతురు లుక్స్ ఆకట్టుకుంటున్నాయ్. మరీ ఎక్కువ మేకప్ లేకుండా, సింపుల్‌గా, సాంప్రదాయంగా అందంగా కనిపిస్తుంది నయన తార. విఘ్నేష్ శివన్ వైట్ అండ్ వైట్ సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నాడు. నయన్, విఘ్నేష్ శివన్‌ల వివాహం తిరుమలలోనే జరగాల్సి వుంది. కానీ, అనుకోని కారణాలతో మహాబలిపురానికి షిప్ట్ అయ్యిందని విఘ్నేష్ శివన్ తెలిపిన సంగతి తెలిసిందే..అయితే తిరుమల శ్రీవారిని దర్షించుకున్న అనంతరం గుడి బయట నయన్ తో పాటు సిబ్బంది చెప్పుల ధరించడం వివాదంగా మారింది.ఆలయ నియమాలను పక్కన పెట్టారని ప్రముఖులు మండి పడుతున్నారు..ఈ విషయం చర్చలకు దారి తీసింది.దీనిపై నయన్ స్పందించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: