తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ రాశి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొని కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా హవా నడిపించింది  అన్న విషయం తెలిసిందే. శుభాకాంక్షలు అనే సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైన రాసి ఆ తర్వాత గోకులంలో సీత, మనసిచ్చి చూడు, పెళ్లి పందిరి, లాంటి సూపర్హిట్ సినిమాల్లో కూడా నటించింది. ఇక సాంప్రదాయానికి చీర కట్టినట్లు ఉండే రాశి తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది అని చెప్పాలి. ఇక ఏ పాత్రలో నటించిన పాత్రకు ప్రాణం పోస్తూ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు.


 ఇక ఇప్పుడు 36 ఏళ్ళ వయస్సులో కూడా ప్రేక్షకులందరికీ దగ్గరగా ఉండేందుకు ఎంతగానో ప్రయత్నాలు చేస్తోంది ఈ సీనియర్ హీరోయిన్. 1981 జూన్ 29వ తేదీన చెన్నైలో జన్మించింది రాశి. అయితే ఆమె తల్లిది భీమవరం కావడం గమనార్హం. ఇక రాశి తాతగారు పద్మాలయ విజయ స్టూడియో కి జూనియర్ అసిస్టెంట్ లను సప్లై చేస్తూ ఉండేవారట. ఇక ఈమె తండ్రి కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి తరువాత డాన్సర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఒకప్పటి స్టార్లు సావిత్రి, భానుమతి, జమున గుమ్మడి రాసి నాన్నమ్మ తాతయ్య తో ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్న వారేనట.


 అయితే రాసి తనకు ఇష్టం లేకపోయినా ఇండస్ట్రీలోకి ఒక వ్యక్తి వల్ల అడుగు పెట్టాను అని ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. అయన ఎవరో కాదు ఆమె తండ్రి. సినిమా ఇండస్ట్రీ లోకి రావడం ఇష్టం లేకపోయినా తన తండ్రి కోరికను కాదనలేక చివరికి హీరోయిన్ గా మారినట్లు చెప్పింది. ఇక మమతల కోవెల అనే సినిమా ద్వారా ఐదేళ్ళ వయస్సులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇక ఎంతో అలవోకగా డైలాగులు చెప్పడం హావ భావాలు పలికించడం చేసి ఎంతో మందిని ఆకర్షించింది. ఆదిత్య369, రావుగారిల్లు, బాలగోపాలుడు అనంతపురం లాంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసింది రాశి. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో రాసికి ఎలా కలిసి వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: