మాస్ మహారాజా రవితేజ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో విజయాలను టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అందుకున్న రవితేజ తాజాగా రామారావు ఆన్ డ్యూటీ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. 

ఈ సినిమాలో రవితేజ సరసన రాజిష విజయన్ , దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ లుగా నటించగా ,  ఈ మూవీ కి శరత్ మండువ దర్శకత్వం వహించాడు. చాలా సంవత్సరాల తర్వాత వేణు తొట్టెంపూడి ఈ మూవీ లో నటించాడు. ఈ మూవీ లో వేణు తొట్టెంపూడి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. రవితేజమూవీ లో  సబ్ కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను జూలై 29 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ ను వేగవంతం చేసింది. ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా రామారావు ఆన్ డ్యూటీ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ నుండి రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు యు / ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అదిరిపోయే రేంజ్ లో ఉత్కంఠను కలిగించే విధంగా ఉండటంతో రవితేజ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: