తెలుగు సినీ ఇండస్ట్రీలో సిల్క్ స్మిత అనే పేరు వినగానే అందరికీ ఎక్కువగా గుర్తుకు వచ్చేది ఆమె అందమే.. ఎందుకంటే తన గ్లామర్ తో ఎంతోమంది కుర్రకారులను సైతం ఆకట్టుకుంది. ఇక అంతే కాకుండా తన అందమైన కళ్ళతో ఎంతోమందిని ఆకర్షించేలా కనిపిస్తూ ఉంటుంది. కేవలం ఈమె తెలుగులోనే కాకుండా తమిళం , కన్నడ, మలయాళం,  హిందీ వంటి భాషలలో కూడా నటించి మంచి పేరు దక్కించుకుంది. మొదటిసారిగా 1979లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈమె. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి శృంగార పాత్రలో కూడా నటించింది.ముఖ్యంగా సిల్క్ స్మిత కెరియర్ లోనే బావలు సయ్య.. మరదలు సయ్య అనే పాటతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. ఎన్నో సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించింది .దాదాపుగా 200 సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. ఇక రెండు మూడు చిత్రాలలో మంచి ప్రాధాన్యత ఉండే పాత్రలో నటించింది. చిన్న హీరోల నుంచి  స్టార్ హీరోల వరకు అందరి సినిమాలలో కూడా నటించింది.ఈ క్రమంలోనే  ఈమె పైన ఎన్నో పుకార్లు కూడా వినిపించాయి. ఎంతో మందితో సంబంధాలు ఉన్నదని వార్తలు కూడా బాగా వినిపించాయి. కానీ ఏ రోజు కూడా వాటిపైన స్పందించలేదు సిల్క్ స్మిత. కాని చివరికి మాత్రం తన జీవితాన్ని ఒంటరిగానే గడిపివేసింది. 1996 సెప్టెంబర్ 23న మద్రాసులో మరణించింది ఈమె.


ఈమె ఆత్మహత్యకి ఇప్పటికీ కూడా సరైన సాక్షాలు లేవు. ఇదంతా ఇలా ఉండగా ఒకప్పుడు ఈమె తను వేసుకునే పొట్టి దుస్తులపై స్పందించి పలు వ్యాఖ్యలు చేయడం జరిగిందట. స్పెషల్ సాంగులు.. చాలీచాలని దుస్తులు వేసుకోవడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉండేదా అనే ప్రశ్న ఎదురుగా అందుకు సిల్క్ స్మిత తన చిన్నప్పటి నుంచి గౌన్లు, మాక్సీ డ్రెస్సులు, మోడ్రన్ దుస్తులు వేసుకోవడం అలవాటు అని తెలియజేసింది. పైగా అలాంటివి డ్రస్సులు ధరించడం తనకేమి కొత్తేమి కాదని కూడా తెలియజేసింది. ప్రేక్షకుల ఆదరణ పొందాలి అంటే అందుకు తగ్గట్టుగా దుస్తులను ధరించాలని తెలియజేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: