టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటువంటి సుధీర్ బాబు తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కృతి శెట్టి , సుధీర్ బాబు సరసన హీరోయిన్ గా నటించగా ,  మోహన కృష్ణ ఇంద్రగంటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇది వరకే సుధీర్ బాబు , krishna INDRAGANTI' target='_blank' title='మోహన్ కృష్ణ ఇంద్రగంటి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో సమ్మోహనం , వి మూవీ లు తెరకెక్కయి. వీరిద్దరి కాంబినేషన్ లో  తెరకెక్కుతున్న హైట్రిక్ మూవీ కావడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 16 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని సెప్టెంబర్ 13 వ తేదీన సాయంత్రం 6 గంటలకు జే ఆర్ సి కన్వెన్షన్స్ ,  ఫిలిం నగర్  , హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు విచ్చేయనున్న ముఖ్య అతిథుల లిస్ట్ ని కూడా మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు కొంత మంది హీరోలు మరియు కొంత మంది దర్శకులు విచ్చేయనున్నారు. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అడవి శేషు , నాగ చైతన్య ,  సిద్దు జొన్నలగడ్డ , అనిల్ రావిపూడి ,  హరీష్ శంకర్ ,  పరుశురామ్ పేట్ల ,  వెంకీ కుడుముల ,  రాహుల్ సంకృతియన్ ఇలా హీరోలు మరియు దర్శకులు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేయనున్నట్లు చిత్త బృందం తెలియ జేస్తూ అధికారికంగా ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: