టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ ని నాచురల్ స్టార్ నాని నిర్మించారు . హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ మూవీ కి సీక్వెల్ గా దర్శకుడు శైలేష్ కొలను హిట్ ది ఫస్ట్ సెకండ్ కేస్ అనే మూవీ ని అడవి శేషు హీరోగా తెరకెక్కి స్తున్నాడు . ఈ మూవీ ని కూడా నాచురల్ స్టార్ నాని నిర్మిస్తున్నాడు . ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా , వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. 

ఇది ఇలా ఉంటే తాజాగా హిట్ ది సెకండ్ కేస్ మూవీ యూనిట్ ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ను విడుదల చేసింది. హిట్ ది సెకండ్ కేస్ మూవీ యూనిట్ తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీని డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఇప్పటికే హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ మంచి విజయం సాధించడంతో హిట్ ది సెకండ్ కేస్ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: