గత కొంతకాలం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో సీక్వెల్స్ హవా నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఒక సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించింది అంటే చాలు ఇక సినిమాకు సీక్వల్ తీయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇక మొదటి సినిమా విజయంతో సీక్వెల్ కి ఎన్నో ప్లస్ పాయింట్లు ఉంటాయని భావిస్తున్నారు. ఇలా సీక్వల్ గా వచ్చి హిట్ కొట్టిన సినిమాలు కూడా ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి అని చెప్పాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


 బాహుబలి 2 : ప్రభాస్ హీరోగా రానా విలన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా బాహుబలి. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించింది. ఇక ఆ తర్వాత బాహుబలి సినిమాకు సీక్వల్ గా బాహుబలి 2 విడుదల చేశారు. ఇక ఇండస్ట్రీలో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను కూడా ఈ సినిమా బ్రేక్ చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా సాధించిన అధికారులను ఇప్పటికీ ఏ సినిమా బ్రేక్ చేయలేదు.


 కార్తికేయ 2  : నిఖిల్ హీరోగా కలర్స్ స్వాతి హీరోయిన్గా 2014లో చందు మండేటి దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాలోని థ్రిల్లింగ్ కథాంశం  ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది అని చెప్పాలి. సినిమాకు సీక్వల్గా విడుదలైన కార్తికేయ 2 కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమా అయినా పాన్ ఇండియా రేంజ్ వసూళ్లు సాధించింది .

 బంగారు రాజు  : నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా మంచి విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సీక్వల్ గా బంగార్రాజు సినిమాను తెరకెక్కించగా ఈ సంక్రాంతికి ఈ సినిమా కూడా విజయం సాధించింది.


 ఆర్య 2  : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఆర్య. ఈ సినిమా సూపర్ హిట్ అందుకోగా మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో ఆర్య 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా పెద్దగా కమర్షియల్ గా హిట్ అవ్వలేదు. కానీ విమర్శకుల ప్రశంసలు అందుకుని యావరేజ్ గా నిలిచింది అని చెప్పాలి.  ఇక ఇప్పుడు మొన్నటికి మొన్న బ్లాక్ బస్టర్ సాధించిన పుష్ప సినిమాకు సీక్వల్ వీరి కాంబినేషన్లో తెరకెక్కుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: