బాలయ్య,బోయపాటి కాంబినేషన్ ను గురించి అందరికి తెలిసిందే..ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన సూపర్ హిట్ కాంబినేషన్‌లో మరో మూవీకి రెడీ అవుతున్నారు.ఈ సినిమాతో బ్లాక్‌ బస్టర్ సాధించటమేకాదు మరో టార్గెట్‌ను కూడా ఎయిమ్ చేస్తున్నారట నందమూరి నటసింహం. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను… బ్లాక్‌ బస్టర్ అన్న పదానికి ఈ కాంబినేషన్‌ పర్యాయపదం. సింహాతో సూపర్‌ హిట్ జర్నీ స్టార్ట్ చేసిన ఈ హీరో, డైరెక్టర్‌… తరువాత లెజెండ్‌, అఖండ తో బాక్సాఫీస్ లెక్కలు మార్చేశారు. అందుకే ఈ మ్యాజికల్ కాంబోను మరోసారి రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు నందమూరి నటసింహం.


ప్రజెంట్‌ గోపిచంద్ మలినేని దర్శకత్వం లో ఓ సినిమాను చేస్తున్నారు బాలయ్య. నెక్ట్స్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో మరో కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బోయపాటి కూడా రామ్‌ హీరోగా ఓ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ అఫీషియల్‌ గా అనౌన్స్ అయిన ఈ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ తరువాత బాలకృష్ణ తో పొలిటికల్ థ్రిల్లర్‌ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు బోయపాటి. ఈ సినిమా ను 2024 ఎలక్షన్‌ టార్గెట్‌గా ప్లాన్ చేస్తున్నారట.. మొత్తం రాజకీయాల కు సంబంధించిన సినిమాగా కథను సిద్దం చేస్తున్నారు..


గాడ్‌ ఫాదర్ లో చిరు పేల్చిన పొలిటికల్‌ డైలాగ్స్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్ వచ్చింది. అలాగే గాడ్ ఫాదర్ కూడా మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు బాలయ్య కూడా పొలిటికల్ కు రెడీ అవుతుండటం తో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే సింహ, లెజెండ్, అఖండ లతో హ్యాట్రిక్ హిట్స్ కొత్తగా బాలయ్య బోయపాటి ఇప్పుడు మరో హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారట.. బాలయ్య ను ఎప్పుడు కనిపించని విధంగా ఈ సినిమాలో చూపించనున్నారు.. ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: