ఒకసారి తమలోని టాలెంట్ చూపించి నటుడుగా ఎదిగిన తర్వాత వారిలోని నటుడిని సంతృప్తి పరుచుకోవడానికి అనేక రకాల పాత్రలను చేయాల్సి ఉంటుంది. అలా అతి తక్కువ కాలంలోనే అన్ని రకాల పాత్రలను ఎంతో సమర్థవంతంగా పోషిస్తున్న నటులలో మొదటగా చెప్పుకోవాల్సిన వ్యక్తి పేరు హీరో అయిన విజయ్ సేతుపతి.


ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఈ స్థాయికి వచ్చిన విజయ్ సేతుపతి కి సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఎంతోమంది సినిమాలు తీస్తారు కానీ అన్ని రకాల పాత్రలు అందరికీ లభించవు. కానీ ఈ విషయంలో విజయ్ సేతుపతి అదృష్టవంతుడు అని చెప్పవచ్చు..


ఉదాహరణకు సూపర్ డీలక్స్ సినిమాలో శిల్ప క్యారెక్టర్ లో మరే హీరోను ఊహించుకోలేము. కేవలం ఆ పాత్రను విజయసేతుపతి మాత్రమే చేయగలడు అనేది చాలామందికి ఉన్న బలమైన అభిప్రాయం. చాలామంది అసలు ఆ సినిమా ఎందుకు చూడాలంటే విజయ్ సేతుపతి కోసం మాత్రమే చూడాలని అనుకునేవారు ఉన్నారట.. ఇక వేద సినిమాలో రగ్గ్ డ్ లుక్ లో కూడా విజయ్ సేతుపతి ఎంతో అద్భుతంగా కనిపించాడు. ఆ పాత్రలో కూడా విజయ్త ని తప్ప మరొకరిని ఊహించుకోలేం. ఇక 96 వంటి సినిమాలో హీరో క్యారెక్టర్ ఎంతో సాఫ్ట్ నేచర్ తో ఉంటుంది. ఈ పాత్రలో విజయ్ సేతుపతిని కాదని మరో హీరోకి అవకాశం ఇస్తే అంతగా హిట్ అయ్యేది కాదేమో అనే విధంగా విజయ్ ఆ పాత్రలో లీనమయ్యాడట..


96 సినిమాను తెలుగులో శర్వానంద్ హీరోగా చేస్తే జనాలు యాక్సెప్ట్ చేయలేదంటే ఆ సినిమా ఎంతలా జనాలను ఆకట్టుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఉప్పెన సినిమాలో విలన్ గా, హీరోయిన్ తండ్రి పాత్రలో నటించడం కూడా విజయ్ సేతుపతికే చెల్లిందట.. మాస్టర్ సినిమాలో భవానిగా కూడా విజయ్ నటన అద్భుతం. ఇక చివరిగా విక్రమ్ సినిమాలో సంతానం పాత్రను ఇంకొక నటుడు చేస్తాడు అంటే ఎవ్వరు కూడా ఒప్పుకోరు. దర్శకుడు సృష్టించిన అద్భుతమైన పాత్రల్లో విజయ్ సేతుపతి ఒదిగిపోయి నటించాడు. ఇక తమిళ్ లో హీరోగా చేస్తూనే విలన్ గా, సెకండ్ హీరోగా, సైడ్ క్యారెక్టర్స్ కూడా చేస్తూ అన్ని రకాల పాత్రలకు న్యాయం చేస్తున్నాడట విజయ్ సేతుపతి.

మరింత సమాచారం తెలుసుకోండి: