తమిళ ప్రేక్షకులు సినిమాలను చూసే విధానానికి, తెలుగు ప్రేక్షకులు సినిమాలను చూసే విధానానికి చాలా తేడాలు ఉన్నాయి. తెలుగులో క్లైమాక్స్ లో హీరో చనిపోతే సినిమాలు సక్సెస్ సాధించే అవకాశాలు తక్కువనే సంగతి తెలిసిందే.
కొత్త హీరోలు, పెద్దగా గుర్తింపు లేని హీరోల సినిమాల విషయంలో ఈ తరహా క్లైమాక్స్ లకు ప్రేక్షకులు అంగీకరించినా ఇప్పటికే గుర్తింపును సంపాదించుకుని స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న హీరోల సినిమాల విషయంలో ఈ తరహా క్లైమాక్స్ లను ప్రేక్షకులు అంగీకరించరు.

కొన్ని సినిమాలు ఇందుకు మినహాయింపు అయినప్పటికీ క్లైమాక్స్ లో హీరో చనిపోవడం వల్ల ఫ్లాపైన సినిమాలు ఉన్నాయి. ప్రభాస్ హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన చక్రం సినిమాకు ఎం తోమంది అభిమా నులు ఉన్నారు. అయితే క్లైమాక్స్ లో హీరో చనిపోవడం వల్ల ప్రభాస్ అభిమానులను అప్పట్లో ఈ సినిమా ఆకట్టుకోలేదు. ఈ సినిమాలోని జగమంత కుటుంబం నాది పాట ఏ రేంజ్ హిట్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

నాగార్జున అంతం మూవీ సైతం ఫ్లాప్ కావడానికి క్లైమాక్స్ లో హీరో చనిపోవడం కారణమనే సంగతి తెలిసిందే.

వేదం సినిమా విషయంలో హీరోలు క్లైమాక్స్ లో చనిపోతారనే సంగతి తెలిసిందే. పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా ఈ సినిమాలు కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలలో క్లైమాక్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ఇదేకారణమని చెప్పవచ్చు. క్లైమాక్స్ లో మార్పు చేయడం వల్లే ఠాగూర్ సినిమా సక్సెస్ సాధించిందని చిరంజీవి భావిస్తారు. అన్ని సినిమాలకు కాకపోయినా కొన్ని సినిమాల విషయంలో మాత్రం క్లైమాక్స్ రిజల్ట్ ను డిసైడ్ చేస్తుందని చెప్పవచ్చు. ఠాగూర్, రాఖీ, టెంపర్, పోకిరి మరికొన్ని సినిమాలు క్లైమాక్స్ అద్భుతంగా ఉండటం వల్లే సక్సెస్ సాధించాయని చాలామంది భావిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: