
బాలయ్య కోసం అనీల్ ఏకంగా స్టార్ హీరోయిన్ త్రిషను రంగంలోకి దింపనున్నారట. గతంలో బాలకృష్ణ నటించిన లయన్ లో హీరోయిన్ గా చేసింది త్రిష. ఇక ఇప్పుడు మరోసారి బాలయ్యతో కలిసి ఈ చిన్నది నటించనుందని టాక్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే త్రిష మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ లో నటించిన విషయం తెలిసిందే. ఐశ్వర్య రాయ్ తో పోటీగా నటించింది త్రిష. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు బాలయ్య కు ఓకే చెప్తుందా అన్నది సందేహంగా మారింది. దానికి కారణం ఈ లో బాలకృష్ణ పక్కన హీరోయిన్ అంటే కథ ప్రకారం శ్రీలీలకు తల్లిగా నటించాలి. మరి తల్లి పాత్రకు త్రిష ఓకే చెప్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.