తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులలో ఒకరు అయిన మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్న మంచు విష్ణు తాజాగా జిన్నా అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సూర్యమూవీ కి దర్శకత్వం వహించగా ,  కోనా వెంకట్మూవీ కి స్క్రీన్ ప్లే ను అందించాడు. ఈ మూవీ లో పాయల్ రాజ్ , సన్నీ లియోన్ లు మంచు విష్ణు సరసన హీరోయిన్ లుగా నటించగా , అనూప్ రూబెన్స్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు.

మూవీ అక్టోబర్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త మిక్స్ డ్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి భారీ మొత్తంలో కలక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించడం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు జున్నా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది.

ఈ ఆరు రోజుల్లో ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 0.52 కోట్ల షేర్ , 1 కోటి గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. 6 రోజులకు గాను జిన్నా మూవీ ప్రపంచ వ్యాప్తంగా 0.56 కోట్ల షేర్ , 1.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా ప్రస్తుతం జిన్నా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా తక్కువ కలెక్షన్ లను వసూలు చేస్తూ బాక్స్ ఆఫీస్ రన్ ని కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే జిన్నా మూవీ కి చోటా కె నాయుడు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: