ఈ ఫోటోలను సామజిక మాధ్యమాల్లో సిమ్రాన్ అప్లోడ్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది.ఒకప్పుడు సైజ్ జీరో కు పెట్టింది పేరు అయినా సిమ్రాన్ తన అంద చందాలతో కుర్రకారు మతులు పోగొట్టింది.ప్రస్తుతం దీపక్ బగ్గ అనే నటుడు మరియు బిజినెస్ మాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు కొడుకులకి తల్లిగా కూడా మారింది.అయితే తమిళం లో రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్న సిమ్రాన్ 2008 నుంచి తెలుగులో నేరుగా ఏ సినిమాలోనూ నటించలేదు.
చివరగా కమెడియన్ కృష్ణ భగవాన్ హీరోగా నటించిన జాన్ అప్పారావు 40+ లో నటించింది.ఎన్నో ఏళ్ళ నుంచి ఆమెను ఒక అందాల దేవతగా, సైజు జీరో హీరోయిన్ గా చూసిన ప్రేక్షకులకు ఇలా ముసలి లుక్ లో సిమ్రాన్ చూసి ఖంగు తిన్నారు.46 ఏళ్ళ వయసులోనే ఇలా తయారవ్వడం వెనక కారణం ఏంటి అనే ప్రశ్న ఆమె ఫ్యాన్స్ లో తలెత్తుతుంది.ఇక సిమ్రాన్ ప్రస్తుతం ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సిమ్రాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న దీపక్ బగ్గ కూడా నటుడు కావడం విశేషం.అతడితో కొన్నేళ్లు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంది.ప్రస్తుతం దీపక్ వ్యాపారం చేస్తున్నాడు.
సిమ్రాన్ కుటుంబం నుంచి మరొక హీరోయిన్ కూడా ఉంది.ఆమె చెల్లి మోనాల్ ప్రేమ విఫలం కావడం తో ఆత్మహత్య చేసుకొని కన్ను మూసింది.
ఇక నిత్యం సోషల్ మీడియాలో అందుబాటులో ఉండే సిమ్రాన్ విడుదల అవుతన్న అనేక సినిమాల గురించి పోస్టులు పెడుతూ ఉంటుంది.ఇక సిమ్రాన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్నన్ని రోజులు ఎక్కువగా అఫైర్స్ తో వార్తల్లో ఉండేది.