తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి విష్ణు విశాల్ గురించి ప్రత్యేకం గా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో తమిళ సినిమా ఇండస్ట్రీ లో రాక్షసన్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. రాక్షసన్ మూవీ తో విష్ణు విశాల్ తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే విష్ణు విశాల్ కొంత కాలం క్రితమే "ఎఫ్ ఐ ఆర్" అనే మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను కూడా పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన "ఎఫ్ ఐ ఆర్" మూవీ పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విష్ణు విశాల్ "మట్టి కుస్తీ" అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. చెల్లా అయ్యావు ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండగా , ఐశ్వ‌ర్య ల‌క్ష్మి  ఈ మూవీ లో విష్ణు విశాల్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ కి రిచ‌ర్డ్ ఎం.నాథ‌న్ సినిమాటో గ్ర‌ఫీ అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా మట్టి కుస్తీ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. 

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. డిసెంబర్ 2 వ తేదీన వరల్డ్ వైడ్ గా మట్టి కుస్తీ మూవీ ని విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. మట్టి కుస్తీ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. మరి ఈ మూవీ తో విష్ణు విశాల్ ఏ రేంజ్ విజయ్యని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: