కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ఎంచుకునే కథల ఎంపిక విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడనడానికి ఆయన తెరకేక్కిస్తున్న సినిమాలే నిదర్శనం అని చెప్పవచ్చు. సమాజంలో జరిగే కొన్ని క్రైమ్ స్టోరీస్ ను కథగా తీసుకొని ఆయన తెరకెక్కించే విధానం ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఈయన తెరకెక్కించే ప్రతి సినిమా కూడా అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో కూడా సందడి చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నాడు కార్తీ.. ఈ క్రమంలోనే ఇటీవల తాజాగా తెరకెక్కించిన చిత్రం సర్దార్. ఈ సినిమాలో కార్తీ డ్యూయల్ పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

పి ఎస్ మిత్రాన్ దర్శకత్వంలో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం గూఢచారి యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో రాశి కన్నా,  రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించగా.. దాదాపు 16 సంవత్సరాల విరామం తర్వాత ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లైలా ప్రత్యేక పాత్రలో నటించింది. రిత్విక్.. బాలాజీ శక్తి వేల్.. అవినాష్.. మునిష్కాంత్.. చుంకీ పాండే.. యుగి సేతు తదితరులు కీలకపాత్ర పోషించారు. 2022 అక్టోబర్ 21వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.  అయితే ఎట్టకేలకు  ప్రముఖ తెలుగు ఆహా ఓటీటీ వేదికగా నవంబర్ 18న ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది . మొదటి రోజు నుంచే ఓటీటీ లో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది ఈ సినిమా.

ఇప్పటికే ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయి మూడు రోజులు అవుతున్నప్పటికీ.. సత్తా చాటుతూ మంచి రేటింగ్స్ సొంతం చేసుకుంటూ ఉండడంతో అటు థియేటర్లలో ఇటు ఓటిటి లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  దీన్ని బట్టి చూస్తే హీరో కార్తీ ఖాతాలో మరొక సంచలన విజయం వచ్చి చేరిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: