తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన మహిళ దర్శకులలో ఒకరు అయినటు వంటి సుధ కొంగర గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుధా కొంగర కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి సూర్య హీరోగా తెరకెక్కిన సూరారై పొట్రు అనే మూవీ కి దర్శకత్వం వహించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం తో ఒక్క సారిగా సుధా కొంగర కి దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమా తెలుగు లో ఆకాశమే నీ హద్దురా అనే పేరుతో విడుదల అయింది.

సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఎంత గానో అలరించింది. ఆకాశమే నీ హద్దురా మూవీ.తో సుధా కొంగర కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ధియేటర్ లలో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సుధా కొంగర , అక్షయ్ కుమార్ తో సూరారై పొట్రు మూవీ ని హిందీ లో రీమేక్ చేస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మహిళా దర్శకురాలు సూరారై పోట్రు హిందీ రీమేక్ తర్వాత తెరకెక్కించబోయే సినిమాకు సంబంధించిన పనులను ఇప్పటి నుండే మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా సుధా కొంగర తన తదుపరి మూవీ ని ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా బయోపిక్ ను తెరపై తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహిళా దర్శకురాలు సుధ కొంగరమూవీ స్క్రిప్ట్ పనులను కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. ఈ మూవీ లో సూర్య , అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలలో నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: