తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి అడవి శేషు తాజాగా హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి శైలేష్ కొలను దర్శకత్వం వహించగా , మీనాక్షి చౌదరిమూవీ లో హీరోయిన్ గా నటించింది. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై ఈ మూవీ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి నాని నిర్మించాడు. ఇది ఇలా ఉంటే ఇది వరకే హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో తెలుగు సినీ ప్రేమికులు ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చుకుంది. 

దానితో ప్రస్తుతం ఈ మూవీ కి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ని నందమూరి నట సింహం బాలకృష్ణ వీక్షించాడు. ఈ విషయాన్ని హిట్ ది సెకండ్ కేస్ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ , బాలకృష్ణ తో ఉన్న కొన్ని ఫోటోలను విడుదల చేసింది. తాజాగా హిట్ ది సెకండ్ కేస్ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ ఫోటోలలో అడవి శేషు , నాచురల్ స్టార్ నాని మరియు నందమూరి బాలకృష్ణ ఉన్నారు. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: