ప్రస్థుతం ప్రేక్షకుల అభిరుచి మారిపోవడంతో మల్టీ ప్లెక్స్ క్వాలిటీతో కూడిన ధియేటర్లలో సినిమాలను చూడటానికి ఇష్టపడుతున్నారు. సౌండ్ సిష్టమ్ క్వాలిటీ ఇలా అన్ని సౌకర్యాలు ఉంటూ టిక్కెట్ రేటు అందుబాటులో ఉంటే సినిమాలు చూడాలని ప్రేక్షకులు ఆశక్తికనపరుస్తున్నారు. ఇలాంటి సదుపాయాలతో ఉన్న ధియేటర్స్ నగరాలలో ఉంటున్నాయి కానీ బి గ్రేడ్ సి గ్రేడ్ పట్టణాలలో ఉండటం లేదు.


చిన్నచిన్న పట్టణాలు పెద్దపెద్ద గ్రామ పంచాయితీలలో సౌకర్యవంతమైన ధియేటర్లు కట్టాలి అంటే చాల డబ్బు ఖర్చు అవుతోంది. అంత ఖర్చు పెట్టి ధియేటర్లు కడితే అవి లాభదాయకం కాదు అన్న అభిప్రాయంతో అలాంటి ధియేటర్ల నిర్మాణం వైపు ఎవరు అడుగులు వేయడంలేదు. ఇలాంటి పరిస్థితులలో మహారాష్ట్రకు చెందిన ఒక సంస్థ క్రియేట్ చేసిన ‘ఇగ్లూ ధియేటర్’ తో ఇండస్ట్రీలోని ధియేటర్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.


‘ఇగ్లూ థియేటర్’. మంచు ప్రాంతాల్లో ఎస్కిమోలు నిర్మించే ఇగ్లూ ఇళ్ల తరహాలో అర ఎకరం విస్తీర్ణంలో ఇలాంటి ధియేటర్లు నిర్మిస్తారు. ఉత్తర తెలంగాణలోని రాజారాం పల్లిలో ఈ ఇగ్లూ థియేటర్‌ను నిర్మించారు. 100 సీట్ల సామర్థ్యం ఈ థియేటర్ నిర్మిచారు. దీనికి అనుబంధంగా క్యాంటీన్ - వాష్ రూమ్స్ - టికెట్ కౌంటర్ ఉన్నాయి. థియేటర్ చిన్నదిగా కనిపిస్తున్నప్పటికీ పెద్ద స్క్రీన్ పిక్చర్ క్లారిటీ, సౌండ్ సిస్టమ్ మల్టీప్లెక్స్‌లకు దీటుగా ఉన్నాయి అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈ ధియేటర్లలో సినిమాను చూసిన ప్రేక్షకులకు 70 ఎంఎం థియేటర్లో సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.


సీటింగ్ ఏసీలు అన్నీ బాగున్నాయి అని అంటున్నారు. ఉత్తర తెలంగాణాలోని రాజారాం పల్లి ప్రాంతానికి చుట్టుపక్కల ప్రాంతాలలోని ప్రజలు అందరు వచ్చి కొత్త సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి తరహా ధియేటర్లు అనంతపురం ఖమ్మం జిల్లాల్లో ఏర్పాటు అయినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన ‘ఛోటా మహారాజ్’ అనే సంస్థ చిన్న టౌన్లు, గ్రామాల కోసం ఈ థియేటర్లను డిజైన్ చేసింది. వారి నుంచి ఫ్రాంఛైజీ తీసుకుని తెలుగు రాష్ట్రాల్లో ఈ థియేటర్లు ఏర్పాటు అవుతున్నాయి. ఈ పద్ధతి విజయవంతం అయితే తెలుగు రాష్ట్రాలలో సినిమా పరిశ్రమకు మళ్ళీ మంచి రోజులు వచ్చే ఆస్కారం ఉంది..



మరింత సమాచారం తెలుసుకోండి: