ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాకుండా రాజకీయాలలో కూడా తన జోరు చూపిస్తున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు పాలిటిక్స్ లో చురుగ్గా పాల్గొంటున్న ఈయన ప్రజల సమస్యలపై కృషి చేస్తూ మంచి నాయకుడు అనిపించుకుంటున్నారు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నట్లు చెప్పే విధంగా ఎలక్షన్స్ క్యాంపెయిన్ కోసం ఒక ప్రత్యేక వాహనాన్ని కూడా సిద్ధం చేయించిన విషయం తెలిసిందే. వారాహి పేరుతో ఈ ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేసిన పవన్ కళ్యాణ్ తన పార్టీ తరఫున ప్రచారం చేయబోతున్నారు. ఇటీవల హైదరాబాదులో ఈ వాహనం ట్రైల్ నిర్వహించారు. తాజాగా ఈ వాహనానికి తెలంగాణ రోడ్డు రవాణా శాఖ లైన్ క్లియర్ ఇచ్చింది.

ఇకపోతే వాహనం పక్కనే భద్రతా సిబ్బంది అలా నడిచి వస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇది చూసిన వైసిపి నేతలు వాహనం కలర్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.. అందుకు కారణం వారాహి వాహనం మిలిటరీ ఆలివ్ గ్రీన్ కలర్ లో ఉండడమే. మిలిటరీ ఆలివ్ గ్రీన్ కలర్ ప్రైవేట్ వాహనాలకు ఉపయోగించడానికి అనుమతి ఉండదని పలువురు పేర్కొన్నారు. మిలిటరీ ఆలివ్ గ్రీన్ కలర్ ఇతర వాహనాలకు వేసుకోవడం మోటార్ వెహికల్ ఆక్ట్ కి విరుద్ధం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి.

తాజాగా ఈ వార్తలపై తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావు మాట్లాడుతూ.. క్లారిటీ ఇచ్చారు.  పవన్ కళ్యాణ్ వారాహి వాహనం ఆలివ్ గ్రీన్ కాదు ఎమరాల్డ్ గ్రీన్ అని స్పష్టం చేశారు.  అంతే కాదు TS13EX8384 పని నంబర్ ప్లేట్ తో పవన్ కళ్యాణ్ వారాహి రిజిస్ట్రేషన్ క్లియర్ చేసాము అని ఆయన స్పష్టం చేశారు. వాహనం బాడీకి సంబంధించి సర్టిఫికెట్ కూడా పరిశీలించామని చట్ట ఉల్లంఘన చేసే అంశాలు ఏవి కనుగొనబడలేదు అని కూడా ఆయన వివరణ ఇచ్చారు. మొత్తానికి వారాహి వాహనంతో ప్రజల్లోకి ప్రచారానికి వెళ్లబోతున్నారు పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: