తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక్కో మూవీ కి తన క్రేజ్ ను పెంచుకుంటూ వెళుతున్న యంగ్ హీరోలలో నిఖిల్ ఒకరు. శేఖర్ కమల దర్శకత్వం లో తెరకెక్కిన హ్యాపీ డేస్ మూవీ తో మంచి గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న ఈ యువ హీరో ఆ తర్వాత స్వామి రారా , కార్తికేయ , ఎక్కడికి పోతావు చిన్నవాడా తాజాగా విడుదల అయిన కార్తికేయ 2 మూవీ లతో తన క్రేజ్ ను అద్భుతమైన రీతిలో పెంచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం నిఖిల్ "కార్తికేయ 2" మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ తెలుగు తో పాటు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టింది. ముఖ్యంగా ఈ మూవీ కి నార్త్ లో అద్భుతమైన కలెక్షన్ లు వచ్చాయి. దానితో నిఖిల్ కు నార్త్ ఇండియాలో కూడా మంచి గుర్తింపు లభించింది.

అలాగే కార్తికేయ 2 మూవీ 100 కోట్ల కు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టడంతో నిఖిల్ క్రేజ్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగిపోయింది. దానితో నిఖిల్ తన రెమ్యూనరేషన్ కూడా పెంచేసినట్లు తెలుస్తోంది. ఇది వరకు నిఖిల్ ఒక్కో మూవీ కి 4 నుంచి 5 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకోగా , ప్రస్తుతం సినిమాకు దాదాపు 8 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా నిఖిల్ "18 పేజెస్" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ డిసెంబర్ 23 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. పల్నాటి సూర్య ప్రతాప్మూవీ కి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: