ఏడాది చివర్లో చిన్న సినిమాలు పోటీ పడుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే స్టార్ హీరోల సినిమాలు కూడా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలు పోటీ పడుతూ ఉండడం గమనార్హం. తాజాగా ఇప్పుడు శుక్రవారం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలు తాజాగా సెన్సార్ బోర్డు పనులను కూడా పూర్తి చేసుకున్నట్లు..U/A సర్టిఫికెట్ కూడా పొందినట్లు సమాచారం. మరి ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించబోతున్న సినిమాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

18 పేజీస్:
మరోసారి నిఖిల్ సిద్ధార్థ -  అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిస్తున్న చిత్రం 18 పేజీస్.  తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ఇటీవల విడుదలవగా  ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.  ఇక ఈ నేపథ్యంలోనే థియేటర్లలో ఈ శుక్రవారం విడుదల కాబోతోంది.


లాఠీ:
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ హీరోగా నటిస్తున్న లత్తి సినిమాను తెలుగులో లాఠీ పేరుతో విడుదల చేయబోతున్నారు.  కానిస్టేబుల్ పాత్రలో విశాల్ ఈ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం .ఈ సినిమా కూడా ఈ శుక్రవారం థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

కనెక్ట్:
నయనతార లేడీ ఓరియంటెడ్ చిత్రంగా రూపొందిస్తున్న కనెక్ట్ సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.  99 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా సినీ చరిత్రలో మొదటిసారి బ్రేక్ లేకుండా హారర్ మూవీ గా ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమవుతోంది . ఈ సినిమాలో నయనతార తన పెర్ఫార్మెన్స్ తో అందరిని పూర్తిస్థాయిలో భయపెట్టేసిందని సమాచారం.  ఇందులో కీలక పాత్రలో అనుపమ్ ఖేర్ కూడా నటిస్తున్నారు.


ధమాకా:
రవితేజ హీరోగా, యంగ్ హీరోయిన్ శ్రీ లీలా హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం ధమాకా. ఈ సినిమా కూడా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేయబోతోంది మాస్ ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో తన కేకుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, టీజర్లన్నీ కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: