తమిళ్ మరియు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన మాస్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు మాస్ సినిమాలతో తమిళ ప్రేక్షకులను అలరించిన ఈ మధ్య మాత్రం పూర్తిగా డల్ అయిపోయాడు అని చెప్పవచ్చు. కొత్తదనం లేని కథలతో వస్తూ ప్రేక్షకుల ఆదరణను నోచుకోలేకపోతున్నాడు. తాజాగా విశాల్ నుండి మరో సరికొత్త యాక్షన్ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు మరియు తమిళ భాషలలో విడుదలైన ఈ సినిమా మొదటి షో నుండి నెగటివ్ టాక్ తెచ్చుకున్నట్లు ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ వస్తోంది. కంటెంట్ పరంగా కొత్తగా ఉందని ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్రబృందం అంత డబ్బా కొట్టుకున్నా అసలు కథ ఏమిటన్నది ఈ రోజు తేలిపోయింది.

దర్శకుడు వినోద్ ఒక సాధారణ కానిస్టేబుల్ గా విశాల్ ను చూపించాడు. కానిస్టేబుల్ గా సమాజంలో ఏ విధంగా లాఠీతో మార్పును తెచ్చాడన్నది కథాంశం. అయితే పాయింట్ కొత్తగా అనిపించినా, విశాల్ నటన కొంతమేరకు బాగున్నా... ఇంటర్వెల్ తర్వాత మాత్రం ప్రేక్షకులు నిరాశపడేలా చేశారట దర్శకుడు వినోద్. ఇంటర్వెల్ ముందు వరకు సినిమాను సహజంగానే మంచి కథనంతో నడిపించగలిగిన దర్శకుడు ఇంటర్వల్ తర్వాత ఒక్కసారిగా గాడి తప్పినట్లు అనిపించింది. ముఖ్యంగా రిలీజ్ కు ముందు వరకు అందరూ ఇంటర్వెల్ తర్వాత వచ్చే 45 నిముషాల ఫైట్ గురించి మాట్లాడుకున్నారు. చిత్రబృందం సైతం ఇదే సినిమాకు ప్లస్ అవుతుందని ఊహించారు.

కానీ ప్రేక్షకుల ముందు మాత్రం ఆ విషయంలోనే పూర్తిగా ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. విశాల్ ఒక బిల్డింగ్ లో విలన్ గ్యాంగ్ లో ఉన్న 100 మందికి పైగా రౌడీలతో ఫైట్ చేయడం అన్న విషయంలో దర్శకుడు కొత్తగా ప్రయత్నం చేయాలనుకుని తప్పటడుగు వేసినట్లు క్లియర్ గా అర్ధం అవుతోంది. ఇక సెంటిమెంట్ డోసు కూడా ఎక్కువ కావడం కొన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చలేదట. ఫైనల్ గా విశాల్ లాఠీ సరిగా పనిచేయలేదని స్పష్టం అవుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: