తమిళ సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న విశాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న విశాల్ తాను నటించిన ఎన్నో మూవీలను తెలుగులో కూడా విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

విశాల్ "పందెంకోడి" మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకొని , ఆ తర్వాత తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగులో విడుదల చేసి వాటితో కొన్ని విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని , ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకున్నాడు.  ఇది ఇలా ఉంటే తాజాగా విశాల్ "లాఠీ" అనే మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ ఈరోజు థియేటర్ లలో విడుదల అయ్యింది. తమిళ్ లో రూపొందిన ఈ మూవీ ని ఈరోజు తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేశారు.

మూవీ కి విడుదల అయిన మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. ముఖ్యంగా ఈ మూవీలో విశాల్ నటనకు గాని ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. అలాగే ఈ మూవీ లోని ఆఖరి 45 నిమిషాలు అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 45 నిమిషాల కోసమే సినిమాను చూసిన తప్పులేదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. "లాఠీ" మూవీ తో విశాల్ పాన్ ఇండియా రేంజ్ లో ఒక మంచి విజయాన్ని అందుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మూవీలో సునైనా హీరోయిన్ గా నటించగా , ఏ వినోద్ కుమార్ దర్శకత్వం వహించాడు. రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ మూవీ ని రమణ నంద దురైరజ్ నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: