అందమైన రంగుల మాయ ప్రపంచంలో సక్సెస్ అవ్వాలంటే గ్లామర్ ఉండాలి.. అలాగే నటనా ప్రతిభ కూడా ఉండాలి.. అందరూ చెప్పే మాట ఇది . అందానికి అందం.. నటనలోనూ వంక పెట్టలేం.. ఇవన్నీ ఉన్న సొట్టబుగ్గల సుందరి నిధి అగర్వాల్.. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు..హీరోయిన్స్ సక్సెస్ సీక్రెట్ గురించి తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న నిధి అగర్వాల్ ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడి సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మన చేతుల్లో ఉండవని చెప్పుకొచ్చింది.

దాదాపు అన్ని కథలు పేపర్ మీద బాగుంటాయి.  సినిమా తీసి నష్టపోవాలని ఎవరు అనుకోరు.. అయితే కొన్ని వర్కౌట్ అవ్వవు అంతే.. అయితే హీరోయిన్ల విషయంలో మాత్రం 90 శాతం అదృష్టం ఉంటేనే స్టార్డం వస్తుంది.. అంటూ తనదైన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. ఒకవేళ బాగా నటించినా సినిమా ఫెయిల్ అయితే మరో ఛాన్స్ రావడం కష్టమే.. సరిగ్గా నటించని సినిమా హిట్ అయితే మంచి పేరు వస్తుంది.  అవకాశాలు కూడా వస్తాయి.. దాని అర్థం అదృష్టం తోనే హిట్టు కొట్టినట్లే. ఆ హిట్టుతోనే స్టార్డం కూడా వస్తుంది అంటూ నిధి అగర్వాల్ అభిప్రాయ పడింది.


ఇక నిధి అగర్వాల్ విషయానికి వస్తే.. అందంతో నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగు, హిందీ చిత్రాలలో ఎక్కువగా నటించింది. మొదట మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన నిధి అగర్వాల్ ఆ తర్వాత నృత్యకారిణి గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టైగర్ ష్రాఫ్ హీరోగా వచ్చిన మున్నా మైఖేల్ చిత్రం ద్వారా 2017 లో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైన నిధి అగర్వాల్.. 2018లో సవ్యసాచి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె హీరో సినిమాతో కూడా పరవాలేదు అనిపించుకుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సరసన అవకాశాన్ని దక్కించుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: