తమిళ స్టార్ విజయ్ నటించిన వారిసు సినిమా ఈ రోజు రిలీజైంది. తెలుగులో వారసుడు పేరుతో రాబోతున్న ఈ సినిమా ముందుగా తమిళంలో విడుదల అయ్యింది. తమిళ  చిత్రం అయినా ఇందులో తెలుగు వారి పాత్ర చాలా ఎక్కువ. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించారు.వంశీ పైడిపల్లి ఈ సినిమాని డైరక్ట్ చేసారు. రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. థమన్ మ్యూజిక్ అందించాడు.ఇక ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది? తెలుసుకుందాం..రాజేంద్రన్(శరత్ కుమార్) ఓ పెద్ద బిజినెస్ మ్యాన్. తన వ్యాపారాన్ని తన ముగ్గురు కొడుకులు జై (శ్రీకాంత్), అజయ్ (శ్యామ్), విజయ్ (విజయ్) వీళ్లలో ఎవరికి అప్పచెప్పాలనే ఆలోచనలో ఉంటాడు. విజయ్ కి తన తండ్రి విధానాలు నచ్చక ఇంటినుంచి బయిటకు వెళ్లిపోతాడు.తన అన్నలు జై,అజయ్ ల కన్ను మాత్రం చైర్మన్ కుర్చీపైనే ఉంటుంది. అలాగే వ్యాపార ప్రత్యర్దుడు జయ్ ప్రకాష్(ప్రకాష్ రాజ్) ఉంటాడు. ఈ క్రమంలో రాజేంద్రన్ తన టైమ్ అయ్యిపోయిందని భావిస్తాడు. తన వ్యాపారానికి అసలైన వారసుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటాడు. 


7 సంవత్సరాల పాటు కుటుంబానికి దూరంగా ఉన్న విజయ్...తన మంచితనం, కుటుంబం పట్ల ప్రేమ ఇంకా బిజినెస్ తెలివితో ఎలా తనే వారసుడు అనిపించుకున్నాడు? ఇంకా తన అన్నలలో ఎలాంటి మార్పు తెచ్చాడు? ప్రత్యర్దిగా ఉండి కుట్ర చేస్తున్న జయప్రకాష్ కి విజయ్ ఎలా బుద్ది చెప్పాడు. ఇంకా తన కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకున్నాడు..హీరోయిన్ రష్మికతో తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? వంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.ఈ సినిమాలోని విజయ్ సీన్స్ ఫ్యాన్స్ కు పండగ చేసేవే. అయితే కామన్ ఆడియన్స్ మాత్రం ఆ స్దాయిలో ఎంజాయ్ చేయలేరు. అయితే అవి అంత బాగా అనిపించవు. కథలో భాగంగా వచ్చేస్తాయి. సెకండాఫ్ లో కామెడీ, హీరోయిజం,మధ్య మధ్యలో సెంటిమెంట్ సీన్స్ సోసోగా ఉంటాయి.ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా అంత కొత్తగా అనిపించదు కానీ విజయ్ ని ఇష్టపడే అభిమానులకు మాత్రం ఈ సినిమా పండుగలా ఉంటుంది. ఇక తెలుగు ప్రేక్షకులని ఈ సినిమా ఎలా మెప్పిస్తుందో చూడాలి?

మరింత సమాచారం తెలుసుకోండి: