‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ విడుదలై 9నెలలు దాటిపోయినా ఇంకా ఆమూవీకి సంబంధించిన వార్తలు మీడియాకు హాట్ టాపిక్ గా మారుతూనే ఉన్నాయి. ఈ పాటకు అమెరికాలోని గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంతో రాజమౌళి పై రాజకీయ నాయకుల నుండి సామాన్యుల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు.


ఈఅవార్డు ఇచ్చిన స్ఫూర్తితో ‘ఆర్ ఆర్ ఆర్’ కు ఆస్కార్ అవార్డులలో ఏదో ఒక అవార్డు వచ్చి తీరుతుందని తెలుగు వారందరు ఆశ పడుతున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలోని ఈపాట చిత్రీకరణ సమయంలో చాల ఆసక్తికర విషయాలు జరిగాయి అని అంటారు. ఈపాటకు కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ ఏకంగా 80 వర్షన్స్ తన సహాయకుల చేత రికార్డు చేయించి రాజమౌళికి చూపెట్టాడట. ఆ 80 వర్షన్స్ ను చాల నిశితంగా పరిశీలించిన రాజమౌళి చివరకు జూనియర్ చరణ్ లు ఒకరి పై ఒకరు భుజం పై చేతులు వేసి స్టెప్స్ వేసే మూమెంట్ ను రాజమౌళి ఓకె చేసాడట.


ఇక ఈపాటలో జూనియర్ చరణ్ లు స్పీడ్ గా స్టెప్స్ వేస్తున్నప్పుడు దుమ్ము రేగే సన్నివేశం కోసం ఏకంగా 20 టేకులు తీసుకుని చివరకు మొదటి టెక్ మాత్రమే బాగా ఉందని జక్కన్న ఓకె చేసాడట. ఈపాట చిత్రీకరణ పూర్తి అయిన తరువాత జూనియర్ కు వచ్చిన మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి వారం రోజులు పట్టిందని స్వయంగా తారక్ ఒక ఇంటర్వ్యూలో ఆమధ్య చెప్పిన విషయం తెలిసిందే.


వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయలేక పోయింది. అయితే అవార్డుల విషయంలో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న ప్రశంసలు అవార్డులును చూసి రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయలేకపోయినా వస్తున్న ఈ అంతర్జాతీయ అవార్డులను చూసిన ఆనందంతో ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్ 2’ గురించి ఆలోచించినా ఆశ్చర్యంలేదు..  





మరింత సమాచారం తెలుసుకోండి:

RRR