ఒకప్పుడు జబర్దస్త్ అంటే కేవలం అదిరిపోయే కామెడీకి కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా మాత్రమే ఉండేది. కానీ ఇటీవల కాలంలో మాత్రం జబర్దస్త్ అనేది కామెడీకి మాత్రమే కాదు లవ్ ట్రాక్లకు కూడా చిరునామాగా మారిపోయింది అని చెప్పాలి.. ఇక ఎప్పుడు ఏదో ఒక లవ్ ట్రాక్ ని తెరమీదకి తీసుకువచ్చి ఇక జబర్దస్త్ కార్యక్రమానికి రేటింగ్ సంపాదించాలని అటు షో నిర్వాహకులు ప్లాన్ చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఒకప్పుడు రష్మీ సుధీర్ లవ్ స్టోరీ ని కూడా ఇలాగే తెరమీదికి వచ్చి సక్సెస్ అయ్యారు. ఇక రష్మీ, సుధీర్ లవ్ ట్రాక్ కారణంగా షోకే రేటింగ్ కూడా అమాంతం పెరిగిపోయింది అని చెప్పాలి.


 కేవలం వీరిద్దరి మధ్య జరిగే ఎంతో రొమాంటిక్ సంభాషణను చూసేందుకే జబర్దస్త్ చూసిన ప్రేక్షకులు కూడా లేకపోలేదు అని చెప్పాలి. అయితే సుధీర్ జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన తర్వాత కొత్త జోడీలను తెరమీదకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన వర్కౌట్ కాలేదు అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో గత కొంతకాలం నుంచి జబర్దస్త్ లో ఒక జోడి బాగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ జోడి ఏదో కాదు జబర్దస్త్ టీం లీడర్ రాకేష్, లేడీ కమెడియన్ సుజాత జోడి.


 వీరిద్దరూ నిజంగా లవ్ లో ఉన్నారా లేకపోతే జబర్దస్త్ షో నిర్వహకుల రేటింగ్ సంపాదించడం ప్లాన్ లో ఇది  ఒక భాగమేనా అన్నది ఇప్పటికి ప్రేక్షకుల్లో నెలకొన్న కన్ఫ్యూజన్ అని చెప్పాలి. కానీ ఇక అప్పుడప్పుడు ఇద్దరు కూడా తాము లవ్ లో ఉన్నాము అంటూ చెబుతూ ఏకంగా ఒకరికి ఒకరు ప్రపోజ్ చేసుకోవడం లాంటివి చేశారు. ఇక ఇటీవలే విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో భాగంగా ఏకంగా రాకింగ్ రాకేష్, సుజాత ఇద్దరు కూడా ఒకరికి ఒకరు రింగ్ చేంజ్ చేసుకున్నారు అని చెప్పాలి. దీంతో ఏకంగా జబర్దస్త్ స్టేజి మీద ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అని చెప్పాలి. ఇది కాస్త ప్రోమోలో హైలెట్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: