రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరు గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు తన సినిమాలతో తన అందం అభినయంతో ప్రేక్షకులకు సుపరిచితురాలుగా మారిపోయింది. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మా. కెరటం అనే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. అయితే మొదటి సినిమా మాత్రం ఈమె కెరీర్ కు ఎక్కడ కలిసి రాలేదు. కాని సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మాత్రం మంచి క్రేజీ సంపాదించి అభిమానులను ఆకర్షించింది. ఆ తర్వాత తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.


 జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది. అయితే ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేకపోవడంతో ఇక బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అక్కడ స్టార్ హీరోల సదస్సును అవకాశాలు వచ్చినప్పటికీ కథల ఎంపికలు తప్పటడుగు వేస్తూ కెరియర్ ని నాశనం చేసుకుంటుంది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ కెరియర్ టాలీవుడ్ లో నాశనం కావడానికి మహేష్ బాబు కారణం అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిపోయింది. అదేంటి రకుల్ కెరీర్ కి మహేష్ బాబుకు సంబంధం ఏంటి అనుకుంటున్నారు కదా. మహేష్ బాబు హీరోగా నటించిన స్పైడర్ సినిమాలో రకుల్ నటించింది.


 ఈ సినిమాలో రకుల్ పాత్ర చూసి అభిమానులు కూడా తిట్టుకున్నారు. ఇక రకుల్ లుక్స్ కూడా ఏమాత్రం అభిమానులకు నచ్చలేదు. స్పైడర్ సినిమాలో ఇక రకుల్ నటన చూసిన తర్వాత ఈమెకు మళ్ళీ అవకాశాలు ఇచ్చేందుకు ఏ దర్శక నిర్మాతలు ముందుకు రాలేదట. దీంతో తెలుగులో అవకాశాలు కనుమరుగయ్యాయి. అదే సమయంలో సీనియర్ హీరోలతో లిప్ లాక్ సన్నివేశాలు నటించడం కారణంగా ఇక కుర్ర హీరోల సినిమాలో ఛాన్సులు ఈ ముద్దుగుమ్మకు దక్కడం లేదట. మొత్తంగా స్పైడర్ సినిమా తర్వాత రకుల్ కెరియర్ పూర్తిగా డౌన్ అయిపోయింది. అందుకే మహేష్ బాబు వల్ల రకుల్ కెరియర్ నాశనమైందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: