కొత్త కొత్త సినిమాలతో కొత్త కొత్త హీరోయిన్లు ఎప్పటికప్పుడు సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతూనే ఉంటారు. ఇక అలా పరిచయమైన హీరోయిన్లలో కొంతమంది హీరోయిన్లు మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. అలా స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరుతారు. కానీ కొంతమంది మాత్రం హీరోయిన్లుగా కొన్ని సినిమాలలో నటించినప్పటికీ హీరోయిన్గా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం తమ టాలెంట్ మరియు ఎక్స్ప్రెషన్లతో సినీ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తూ స్టార్ హీరోయిన్గా మారతారు. అయితే తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఆమెగోస్ సినిమా ఇటీవల భార్య అంచనాల నడుమ విడుదలైంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా కన్నడ బ్యూటీ ఆశిక రంగనాథ్ నటించింది.

తనకి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే తన బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అయితే ఆశిక రంగనాథ్ కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఆమె. 2016లో క్రేజీ బాయ్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈమె. కన్నడలోనే కాకుండా ఈ సినిమా తెలుగులో కూడా విడుదలైంది.ఈ కన్నడ హీరోయిన్ కన్నడ స్టార్ హీరోలైన పునీత్ రాజ్కుమార్, శివరాజ్ కుమార్ మరియు దిలీప్ ప్రకాష్ వంటి చాలామంది స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించింది. కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీ తో పాటు తమిళంలో కూడా తన టాలెంట్ ని చూపించాలని ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

తమిళంలో ఈమెకి అనుకున్నంత సక్సెస్ రాకపోవడంతో మళ్లీ తెలుగు సినీ ఇండస్ట్రీకి వచ్చి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ టీజర్ పాటలు విడుదలై మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. ఇక ఈ సినిమాలో ఈ హీరోయిన్ అందానికి చాలామంది ఫిదా కూడా అయ్యారు. ఇదిలా ఉంటే ఇక ఈమె 1996 ఆగస్టు 5న రంగనాథ్ మరియు సుధాకర్ దంపతులకు కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో ఉన్న తుమకూరులో జన్మించింది. తన చదువు మొత్తం బెంగళూరులోనే పూర్తి చేసింది తన అక్క అనూష రంగనాథ్ కూడా సినిమాల్లో హీరోయిన్ గా ట్రై చేస్తుంది. చిన్నప్పటినుండి తనకి సినిమాల మీద ఉన్న ఇష్టంతో హీరోయిన్గా పరిచయమైంది ఈమె. ప్రస్తుతం ఈమె కళ్యాణ్ రామ్ సరసన నటించిన సినిమా గనక మంచి విజయాన్ని అందుకుంటే ఈమె కూడా స్టార్ హీరోయిన్ గా మారడం కన్ఫామ్ అని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: