ఒక సినిమా ఫలితం పాజిటివ్ అయినా ? నెగటివ్ అయినా ? రెండు వారాలకు మించి థియేటర్ లలో ఉండడం కష్టతరంగా మారుతున్న విషయం తెలిసిందే. ఎంత హిట్ సినిమా అయినా మొదటి వారంలో ఎన్ని కలెక్షన్ లు సాధిస్తే అవే ఆ సినిమాకు ప్రాణం. ఆ తర్వాత వారంలో కలెక్షన్ లు రావడం చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ గతంలో మనము సినిమా పరిశ్రమను చూస్తే శతదినోత్సవాలు , అర్ధ శతదినోత్సవాలు జరుపుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ నేడు కనీసం 25 రోజులు థియేటర్ లో సినిమా నిలబడితే చాలు గ్రేట్. ఈరోజుల్లో విడుదలవుతున్న చాలా సినిమాల పరిస్థితి కూడా ఘోరంగా ఉంది.

కాగా రేపు తమిళ్ హీరో ధనుష్ నటించిన ద్విభాషా చిత్రం సార్ ఘనంగా థియేటర్ లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన వెంకీ అట్లూరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా విశ్వాసంతో ఉన్నారు. వెంకీ అట్లూరిసినిమా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. ఇక ఏకంగా తమిళ్ లో ఈ సినిమా 8 వారాలు ఆడుతుందని చెప్పడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే వెంకీ అట్లూరి దర్శకుడిగా మారిన అనంతరం తెరకెక్కించింది కేవలం మూడు చిత్రాలే. మొదటి సినిమా తొలిప్రేమతోనే ఘనంగా తన ప్రస్థానాన్ని తెలుగు సినిమా పరిశ్రమకు చాటాడు.

అయితే ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు మిస్టర్ మజ్ను మరియు రంగ్ దే సినిమాలు నిరాశను మిగిల్చాయి. ఆ తరువాత కొంచెం గ్యాప్ తీసుకుని ఒక మంచి సందేశం కలిగిన కథతో "సార్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో ధనుష్ ఒక ఉపాధ్యాయుడుగా నటిస్తుండగా , అతనికి సరసన సంయుక్త మీనన్ చేసింది. మరి ఈ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అటు ధనుష్ కి మరియు డైరెక్టర్ వెంకీ అట్లూరి కి బ్రేక్ ఇస్తుందా చూడాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి: