
అయితే ఇలా ఉదయ్ కిరణ్ ఇలా అందరికీ దూరం అయినప్పటికీ కూడా ఇంకా ప్రేక్షకుల మదిలో మాత్రం ఆయన స్థానం అలాగే ఉండిపోయింది అని చెప్పాలి. అయితే ఉదయ్ కిరణ్ కెరియర్ లో మంచి విజయం సాధించిన సినిమాలలో.. నీ స్నేహం కూడా ఒకటి. పరుచూరి మురళి దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అని చెప్పాలి. ఇక మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్స్ సొంతం చేసుకుని మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ సరసన ఆర్తి అగర్వాల్ జంటగా నటించింది.
ఈ సినిమాకు ఆర్పి పట్నాయక్ అందించిన మ్యూజిక్ అయితే ప్రాణం పోసింది అని చెప్పాలి. ఇప్పటికి కూడా నీ స్నేహం టైటిల్ సాంగ్ ఎవరు గ్రీన్ గా కొనసాగుతోంది . అయితే ఇక ఈ సినిమాలో ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్తో పాటు ఉదయ్ కిరణ్ స్నేహితుడిగా నటించిన జతిన్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఉదయ్ కిరణ్, జతిన్ మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్ ప్రేక్షకులు కన్నీళ్లు తెప్పించాయి అని చెప్పాలి. అయితే ముంబైలో పుట్టిన జతిన్ మోడల్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ప్రైవేట్ ఆల్బమ్స్, హిందీ చిత్రాల్లో కూడా నటించాడు. టీవీ కార్యక్రమాల్లో కూడా నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇక తెలుగు, హిందీతో పాటు పంజాబీ చిత్రాల్లో కూడా నటించాడు. ప్రస్తుతం జతిన్ అమెరికాలోని కాలిఫోర్నియాలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. 2010లో కరోలినా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పాలి. వీరికి ఇద్దరు పిల్లలు కాగా ప్రస్తుతం జతిన్ సినిమాలకు దూరంగానే ఉంటున్నాడు అని చెప్పాలి.