మొన్నటి వరకు వెంకీ అట్లూరి గురించి ప్రేక్షకులు మరిచిపోతున్నారు అని అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా.. మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన సార్ సినిమాకు దర్శకత్వం వహించి వెలుగులోకి వచ్చారు వెంకీ అట్లూరి. అయితే ఈ సినిమా ఊహించిన విధంగా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో వెంకీ అట్లూరి పేరు ఎక్కడ చూసినా మారుమ్రోగుతోంది. ఇదే సినిమాను తమిళ్లో వాతి పేరిట రిలీజ్ చేయగా అక్కడ కూడా ఈ సినిమా భారీ స్పందన పొందడం గమనార్హం.

సినిమా ఫిబ్రవరి 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.  అంతేకాదు ఈ సినిమాను ప్రముఖ బడా బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు..  ఇదిలా ఉండగా ఈ సినిమా సక్సెస్ పొందిన నేపథ్యంలో చెన్నైలో చిత్ర బృందం గ్రాండ్గా సక్సెస్ మీట్ను ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా వాతి బ్లాక్ బాస్టర్ విజయానికి మీడియానే కారణమని వెంకీ అట్లూరి చెప్పడంతో అక్కడ ఉన్న వారంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. వాతి సినిమా విడుదలకు ముందే మీడియాకు మేము ప్రత్యేకంగా షోలు వేయడం జరిగింది. ఈ సినిమా చూసినవారు సినిమాకు మంచి పాజిటివ్ రేటింగ్ ఇస్తూ రివ్యూలు కూడా రాశారు. ఇదే పాజిటివ్ టాక్ సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో కూడా కనిపించింది.

ఈరోజు ఈ సినిమా రూ.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది అంటూ తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికి తాను కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కి వీరాభిమాని అని.. త్వరలోనే అజిత్ తో సినిమా తీస్తాను అని వెంకీ అట్లూరి తన కోరికను బయటపెట్టారు. దీంతో తమిళ్లో వాతి సినిమా భారీ విజయం సాధించడంతో అజిత్ అభిమానులు కూడా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చే అజిత్ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: