మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ యువ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ పోయిన సంవత్సరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గుపాటి ... రానా హీరో లుగా రూపొందినటు వంటి భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో రానా భార్య పాత్రలో నటించిన సంయుక్త తన నటన తో ప్రేక్షకులను మరియు విమర్శకులను మెప్పించింది. 

అలా భీమ్లా నాయక్ మూవీ ద్వారా ప్రేక్షకులను ... విమర్శకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా సార్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధనుష్ హీరోగా రూపొందిన ఈ మూవీ కి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను రాబడుతుంది. ఈ మూవీ తెలుగు తో పాటు తమిళ్ లో కూడా విడుదల అయింది. తమిళ్ లో కూడా ప్రస్తుతం ఈ మూవీ కి మంచి కలెక్షన్ లు వస్తున్నాయి. ఈ మూవీ ద్వారా సంయుక్త కు తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు లభించింది. 

తమిళ్ లో ఈ సినిమా వెత్తి అనే పేరుతో విడుదల అయింది. ఇలా ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ముందుకు సాగిస్తున్న సంయుక్త ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా సంయుక్త అదిరిపోయే లుక్ లో ఉన్న వైట్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన వైట్ కలర్ లో ఉన్న బ్లౌస్ ను ధరించి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ వచ్చింది. ప్రస్తుతం సంయుక్త కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: