ప్రస్థుతం టాప్ హీరోల మార్కెట్ ను బట్టి వారికి ఇచ్చే భారీ పారితోషికం ఆధారపడి ఉంటుంది. వారు నటించిన సినిమాల మార్కెట్ పెరుగుతున్న కొద్ది ఇండస్ట్రీలో వారి పై క్రేజ్ పెరిగిపోతుంటుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న మహేష్ త్రివిక్రమ్మూవీ పై అంచనాలు చాల హెచ్చుగా ఉన్నాయి. మహేష్ కెరియర్ లో మొట్టమొదటిసారి పాన్ ఇండియా మూవీగా ఈమూవీని ఒకేసారి చాల భాషలలో విడుదల చేయబోతున్నారు.


ఈ అంచనాలకు తగ్గట్టుగా ఈమూవీ పై భారీ బడ్జెట్ ఖర్చు పెడుతూ ఉండటంతో ఈమూవీకి సంబంధించిన ఓవర్సీస్ అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలోని ఏరియాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయమై విపరీతమైన పోటీ ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ ఓవర్సీస్ హక్కులను 24 కోట్లకు నిర్మాతలు కోట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో అమెరికా ఓవర్సీస్ రైట్స్ కోసం 16 కోట్లమేర కోట్ జరిగినట్లు తెలుస్తోంది.


ఇమ్తడి భారీ మొత్తానికి ఒక ఓవర్సీస్ బయ్యర్ ఈసినిమాను కొనాలి అంటే అతడు నష్టాలు లేకుండా బయట పడటానికి ఆమూవీకి 4 మిలియన్ల డాలర్లు రావలసి ఉంటుంది అని అంచనాలు వస్తున్నాయి. త్రివిక్రమ్ బ్లాక్ బష్టర్ మూవీగా పేరుగాంచిన ‘అల వైకుంఠ పురములో’ మూవీకి కేవలం 3.5 మిలియన్ల డాలర్లు మాత్రమే వచ్చిన నేపధ్యంలో ఆస్థాయిని మించిన బ్లాక్ బష్టర్ హిట్ అయ్యే రేంజ్ లేటెస్ట్ గా నిర్మాణం జరుపుకుంటున్న మహేష్ త్రివిక్రమ్ ల మూవీకి ఉందా అంటూ కొందరు గుసగుసలు ఆడుకుంటున్నట్లు టాక్.



ఈ పరిస్థితులు ఇలా ఉండగా లేటెస్ట్ గా మహేష్ తన ఇన్ స్టా గ్రామ్ ఎకౌంట్ లో షేర్ చేసిన అతడి వర్కౌట్ ఫోటోలో క్షణాలలో మీడియాకు వైరల్ గా మారిపోయాయి. అతడి మాస్ లుక్ అదిరిపోయింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. వాస్తవానికి ఈలుక్ త్రివిక్రమ్ సినిమా కోసమా లేదంటే ఈ సంవత్సరం చివరిలో ప్రారంభం కావలసి ఉన్న రాజమౌళి సినిమా కోసం ఇప్పటి నుండే మహేష్ కష్టపడటం ప్రారంభించాడా అంటూ కొందరు అప్పుడే కామెంట్స్ మొదలు పెట్టారు..



మరింత సమాచారం తెలుసుకోండి: