డైరెక్టర్ కొరటాల శివ ,ఎన్టీఆర్ మొదలు పెట్టబోతున్న 30వ సినిమా భారీ అంచనాల మధ్య ఉండబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫ్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపుగా పూర్తి అయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా లో హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారనే విషయం చాలా రోజులుగా సస్పెన్స్ గా కొనసాగుతూనే ఉంది. ఇక మొత్తానికి చిత్ర బృందం ఎక్కువ స్థాయిలో ఊహించినట్లుగానే జాన్వీ కపూర్ ను సెలెక్ట్ చేసుకున్నారు.
మొదటిసారి తెలుగులో ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్ సినిమా కావడంతో ఇమె కెరీర్ కు చాలా కీలకంగా మారబోతోంది. జూనియర్ ఎన్టీఆర్,జాన్వీ కపూర్ కాంబినేషన్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.ఎట్టకేలకు ఈ రోజున జాన్వీ పుట్టిన రోజు కావడం చేత ఈరోజు ఈమెకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ లుక్ లో జాన్వీ కపూర్ అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపిస్తూ అందరిని బాగా ఆకట్టుకుంటోంది. చందమామ లాంటి మొహంతో లంగా వోణీలు అచ్చ తెలుగు అమ్మాయిగా ట్రెడిషనల్ గా బాగా ఆకట్టుకుంటోంది.


మరొకవైపు తన నడుము అందాలను చూపిస్తూ హైలైట్ చేస్తోంది. ఏది ఏమైనా ntr -30 లో హీరోయిన్ విషయంపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు బాలీవుడ్ లోనే పలు సినిమాలను నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ సరైన సక్సెస్ రాలేదు. ఎప్పటి నుంచే సౌత్ లో ఎంట్రీ ఇవ్వాలని ఆలోచనలో ఉన్న సరైన అవకాశాలు రాకపోవడంతో ఎంట్రీ ఇవ్వలేదు.ఇప్పుడు మొత్తానికి ఎన్టీఆర్ తో పాన్ ఇండియా లెవెల్లో మొదటి సినిమాతోనే ఎంట్రీ ఇవ్వడంతో ఈమె అభిమానులు కాస్త సంబరపడిపోతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: