మోస్ట్ బ్యూటిఫుల్ నటీ మణుల లో ఒకరు అయినటు వంటి సదా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సదా ... తేజ దర్శకత్వం లో నితిన్ హీరోగా రూపొందినటు వంటి జయం మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది . ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం అలాగే ఈ మూవీ లో సదా నటన కు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించడంతో ఈ ముద్దు గుమ్మకు ఫుల్ క్రేజ్ లభించింది. ఆ తర్వాత సదా తమిళ సినిమాల్లో కూడా అవకాశాలను దక్కించుకుంది. 


అందులో భాగంగా అనేక తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సదా "అపరిచితుడు" అనే తమిళ మూవీ తో అదిరిపోయే రేంజ్ సక్సెస్ ను అందుకొని తన క్రేజ్ ను అమాంతం పెంచుకుంది. ఇలా తెలుగు మరియు తమిళ సినిమా ఇండస్ట్రీ లో అనేక మూవీ లలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం ఈటీవీ లో ప్రసారం అవుతున్న డీ డాన్స్ ప్రో గ్రాం కు జడ్జిగా వ్యవహరిస్తుంది. అలాగే పలు సినిమా లలో కూడా నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. 

లా కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు సాగిస్తున్న సదా ఈ మధ్య కాలంలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా సదా తాజాగా అదిరిపోయే లుక్ లో ఉన్న పింక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం మోస్ట్ బ్యూటిఫుల్ నటి సదా కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: