అల్లు అర్జున్ ను కథ విషయంలో మెప్పించాలి అంటే చాల కష్టమైన పని అని అతడికి కథలు చెప్పిన చాలామంది దర్శకులు అంటూ ఉంటారు. దీనికితోడు ఒక దర్శకుడుకి సూపర్ హిట్ రాగానే అతడు వేరే హీరో కాంపౌండ్ లోకి వెళ్ళకుండా ఏదైనా మంచి కథ ఉంటే తన దగ్గరకు రమ్మని బన్నీ మెసేజ్ లు పెడుతూ ఉంటాడు అని కూడ అంటూ ఉంటారు.

 

 దీనితో అల్లు అర్జున్ పిలుపు కోసం ఎదురు చూస్తున్న దర్శకుల లిస్టు రోజురోజుకి పెరిగిపోతోంది. ‘ఐకాన్’ మూవీని నమ్ముకుని ఎంత కాలంగానో ఎదురు చూస్తున్నాడు. అంతేకాదు చాలాకాలం ఈ దర్శకుడు ‘ఐకాన్’ లేబుల్ ఉన్న టోపీని పెట్టుకుని ప్రతి చోట కనిపించేవాడు. అయితే ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఆతరువాత బన్నీ తమిళంలో ఒక డైరెక్ట్ సినిమాను చేస్తాడు అంటూ దానికి మురగ దాస్ దర్శకుడు అంటూ మరొక హడావిడి జరిగింది.

 

 
మురగ దాస్ కు ఫెయిల్యూర్స్ రావడంతో ఆ మూవీని పక్కకు పెట్టారు. ఆతరువాత బన్నీ కొరటాల శివ తో సినిమా అంటూ ప్రకటన కూడ ఇచ్చారు. అది కూడ కార్యరూపం దాల్చలేదు. ఆపై బన్నీతో సురేంద్ర రెడ్డి హరీష్ శంకర్ సినిమాలు అన్నారు అవి కూడ అటకెక్కాయి. ఇప్పుడు లేటెస్ట్ గా బన్నీని దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వం వహించబోతున్నాడు అని వస్తున్న వార్తలు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి.

 

‘అర్జున్ రెడ్డి’ రెండు భాషల్లో తీసిన అనుభవంతో యానిమల్ సినిమా చేస్తున్నాడు సందీప్ వంగా. వాస్తవానికి అతడు ప్రభాస్ తో కూడ ఒక మూవీ చేయవలసి ఉంది. ఆమూవీ ఎప్పుడు మొదలవుతుందో ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఈలోపున అల్లు అర్జున్ తో సినిమా అన్న వార్తలు వస్తున్నాయి. అయితే సందీప్ రెడ్డి తీస్తున్న యానిమల్ ఫలితం బట్టి అల్లు అర్జున్ నిర్ణయం ఉంటుంది అంటు కొందరు అంచనాలు వేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: