ఇటీవల కాలంలో అందరూ హీరోలు కూడా తమ సినిమాలను కేవలం తమ సొంత భాషలో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా విడుదల చేసి సూపర్ హిట్ సాధించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా రేంజ్ లోనే సినిమాలను తెరకెక్కించి ఇక అన్ని భాషల్లో మార్కెట్ను పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారు అందరికి హీరోలు. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి కూడా తెలుగు మార్కెట్ పై కన్నేసిన తమిళ హీరోలు తమ సినిమాలను బైలింగ్వల్ మూవీలుగా  తెరకెక్కించి ఇక్కడ విడుదల చేస్తున్నారు. ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సైతం ఇదే బాటలో నడిచాడు. ధనుష్ నటించిన సార్ సినిమా ఇటీవలే తెలుగులో కూడా గ్రాండ్ గా విడుదల చేశారు అని చెప్పాలి.


 అయితే అంతకుముందే ధనుష్ నటించిన కొన్ని సినిమాలు తెలుగులో సూపర్ హిట్ కావడంతో ఇక్కడ కూడా ఆయనకు కోట్లలోని అభిమానులు ఉన్నారు. దీంతో సార్ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఏ హీరో కైనా సరే ఎన్ని భాషల్లో విడుదల చేసినా మొదట వారి మాతృభాషలో ఎక్కువగా వసూలు వచ్చి మిగతా భాషల్లో కాస్త తక్కువగా వసూలు రావడం చూస్తూ ఉంటాం. కానీ ధనుష్ సార్ విషయంలో మాత్రం ఇది తారుమారు అయింది అని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా 103.86 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.



 కాగా ధనుష్ సార్ సినిమా నైజాంలో 150, సీడెడ్ లో 55 ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా 210 థియేటర్లలో విడుదలైంది. ఇలా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కలిపి 415 థియేటర్లలో గ్రాండ్ గా ఈ సినిమాను విడుదల చేశారు. అయితే ధనుష్ సార్ సినిమా తమిళం కంటే తెలుగులోనే ఎక్కువగా ప్రజాధరణ పొందుతూ దూసుకుపోతుంది. తెలుగులో 35 కోట్ల బిజినెస్ చేసుకుంది ఈ సినిమా. ఈ క్రమంలోనే  36 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగి ఇక ఎప్పుడో బ్రేక్ ఈవెన్ దాటేసింది. కానీ ఇటీవల 18వ రోజు అయినా సోమవారం రోజున కూడా తెలుగు రాష్ట్రాల్లో సార్ సినిమా సత్తా చాటింది. ఏకంగా ఒకేరోజు ఒక కోటి నెట్ కలెక్షన్స్ వచ్చింది. కానీ తమిళంలో మాత్రం ఈ సినిమా ఆక్యుఫెన్సీ మరింత దారుణంగా ఉంది. సోమవారం సాయంత్రం సమయానికి 5.82 ఆక్యుపేన్సీ అయితే అటు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సోమవారం సాయంత్రానికి 25.75 శాతం ఆక్యుఫెన్సీ నమోదయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: