హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం ధమ్కి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తున్నారు. హీరో విశ్వక్ సేన్ ఈ చిత్రానికి తాను స్వయంగా దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా విడుదల తేదీ పోస్ట్ పోన్ అవుతూనే ఉంటోంది. తాజాగా మార్చి 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత విడుదల వాయిదా పడుతూ వస్తూనే ఉంది.


భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విశ్వక్ సరసన హీరోయిన్ పేతురాజ్ నటిస్తున్నది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ 2.0 విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలియజేయడం జరిగింది. అది కూడా మార్చి 12వ తేదీన విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలు పరవాలేదు అనిపించుకున్నాయి అలాగే ధమ్కి 1.0 ట్రైలర్ను బాలయ్య చేతుల మీదుగా విడుదల చేశారు ఈ ట్రైలర్ ఈ సినిమా పైన ఆసక్తిని క్రియేట్ చేయడమే కాకుండా మంచి హైప్ కూడా అందుకున్నది.


ఇక విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ ని వేగవంతం చేస్తున్నారు చిత్ర బృందం.ధమ్కి 2.0 అదేవిధంగా ట్రైలర్ ని మార్చి 12వ తేదీన కరీంనగర్లో జరిగే ఈవెంట్లో చాలా గ్రాండ్గా విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ క్లాస్ మాస్ లుక్కులతో ఆకట్టుకుంటున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగు రాస్తూ ఉండగా లియాన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు ఈ సినిమాని తెలుగు తమిళ మలయాళం హిందీ వంటి భాషలలో విడుదల చేస్తున్నారు ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి ,పృథ్విరాజ్ తదితరులు సైతం నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: