తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ కలిగిన దర్శకుల్లో ఒకరు అయినటు వంటి ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు ఇప్పటికే కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి వాటిలో ఎక్కువ శాతం విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడు గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకుల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్న ఈ యువ దర్శకుడు ప్రస్తుతం హనుమాన్ అనే మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

మూవీ లో తేజ సజ్జ హీరో గా నటిస్తున్నాడు. ఇప్పటికే తేజ ... ప్రశాంత్ కాంబినేషన్ లో జాంబి రెడ్డి అనే మూవీ రూపొంది మంచి విజయం సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న రెండవ మూవీ కావడంతో హనుమాన్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి చిత్ర బృందం టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ ప్రేక్షకుల అంచనాలకు మించి అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ ని మే 12 వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను కూడా మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ యూనిట్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ మూవీ తో తేజ ... ప్రశాంత్ ఏ రేంజ్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: