
ముఖ్యంగా ఇది చూసిన విజయ్ దేవరకొండ అభిమానులు షాక్ అవుతున్నారు.. ఆనంద్ దేవరకొండ ఏంటి రష్మికను అలా పిలిచాడు అంటూ ప్రతి ఒక్కరు తమ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.. ఇకపోతే గత కొన్ని రోజులుగా విజయ్ , రష్మికల మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోందనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు రష్మిక.. విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే ఏ ఫంక్షన్ కి అయినా సరే తప్పకుండా హాజరవుతుంది.. అందుకే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నా.. వీటిపై వీరిద్దరూ ఏ రోజు కూడా క్లియర్ గా ఓపెన్ అవ్వలేదు.
అటు విజయ్ దేవరకొండ కూడా ఈ వార్తలపై స్పందించకుండా తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు. ఆనంద్ దేవరకొండ బేబీ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యారు. మరొకవైపు రష్మిక కేవలం పుష్ప 2 లో మాత్రమే బిజీగా ఉంది. ఇక ఈ సినిమా పూర్తి అయితే ఆమె ఖాళీగా ఉండాల్సిందే అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి చూద్దాం ఇకనైనా రష్మిక హక్కులు వస్తాయో లేదో..