తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస మూవీ లతో ఫుల్ జోష్ ను చూపిస్తున్న యువ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. ఇది ఇలా ఉంటే విశ్వక్ ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా విశ్వక్ "ఓరి దేవుడా" అనే మూవీ లో హీరో గా నటించాడు. విక్టరీ వెంకటేష్మూవీ లో కీలక పాత్రలో నటించగా ... అశ్విత్ మరిముత్తు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో దాస్ కా దమ్కి అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో విశ్వక్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీకి దర్శకత్వం కూడా వహించాడు. నివేత పేతురాజ్మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని మార్చి 22 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ లలో విశ్వక్ మరియు ఈ చిత్ర బృందం చాలా చురుగ్గా పాల్గొంటుంది. ఇది ఇలా ఉంటే విశ్వక్ నటించిన తాజా సినిమా విడుదలకు రెడీగా ఉన్న నేపథ్యంలోనే విశ్వక్ కు సంబంధించిన మరో మూవీ అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది.

విశ్వక్ తదుపరి మూవీ కి సంబంధించిన అప్డేట్ కొంత సమయం విడుదల అయింది. విశ్వక్ 10 వ మూవీ ని ఎస్ఆర్టి మూవీస్ బ్యానర్ పై రామ్ తల్లూరి నిర్మాతగా రూపొందబోతున్నట్టు ... ఈ మూవీ కి రవితేజ మల్లపూడి దర్శకత్వం వహించబోతున్నట్లు ... ఈ మూవీ యొక్క షూటింగ్ ను మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: