
అంతేకాదు ఇక కొత్తగా ఇంకెంతో మంది ఇండస్ట్రీలోకి డాన్స్ మాస్టర్లుగా ఎంట్రీ ఇచ్చి వరుసగా అవకాశాలు కూడా దక్కించుకుంటున్నారు. అయితే ఒకప్పుడు 'ఢీ' షో అంటే కేవలం డాన్స్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు డాన్స్ కు మించిన ఎంటర్టైన్మెంట్ కూడా ప్రేక్షకులకు అందుతుంది అని చెప్పాలి. ఏకంగా కామెడీ షోలకంటే ఎక్కువగా 'ఢీ' షో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఇక ఇటీవల కాలంలో అయితే 'ఢీ' షోలో అటు డాన్స్ మాస్టర్ పండు తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. ఇకపోతే వచ్చేవారం ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది.
ఈ ప్రోమోలో భాగంగా మరోసారి డాన్స్ మాస్టర్ పండు తనదైన శైలిలో సందడి చేశాడు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో జడ్జ్ లుగా ఉన్న శేఖర్ మాస్టర్, శ్రద్ధ దాస్ ఇద్దరు కూడా చేతిలో కర్రలు పట్టుకుని మాస్టర్ పండు వీపు విమానం మోత మోగించారు. ఇక ఆ తర్వాత హైపర్ ఆది, యాంకర్ ప్రదీప్ సైతం చేతిలో కర్రలు పట్టుకొని అటు 'ఢీ' స్టేజ్ మీదే మాస్టర్ పండుని చితక్కొట్టుడు కొట్టారు అని చెప్పాలి. అయితే ఇక దెబ్బలకు తాళలేక పండు పరిగెత్తుకుంటూ వెళ్లి స్టేజి వెనకాల దాక్కున్నాడు ఇదంతా ఫన్నీ స్కిట్ కావడంతో ఇది చూసే ప్రేక్షకులు అందరూ తెగ నవ్వుకున్నారు.