టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో ఐనా విక్టరీ వెంకటేష్ ఈ మధ్యనే రానా నాయుడు సిరీస్ తో కొద్దిగా విమర్శల పాలయ్యాడు. ఎన్ని విమర్శలు వచ్చినా సిరీస్ మాత్రం హిట్ అందుకోవడంతో వెంకీ మామ మస్త్ ఖుషీ లో ఉన్నాడు.

ఇక ఈ సిరీస్ తరువాత వెంకీ నటిస్తున్న చిత్రం సైంధవ్. హిట్ సిరీస్ తో హిట్లు కొట్టేస్తున్న శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నిహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన వెంకీ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇక గత కొన్నిరోజులుగా టాలీవుడ్ హీరోలందరూ.. తమ తమ్మ కొత్త సినిమాల రిలీజ్ డేట్స్ ను ప్రకటించి అభిమానులను సంతోషపరుస్తున్నారు.

ఇక తాజాగా వెంకటేష్ సైతం తన సైంధవ్ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించేశాడు. ఈ సినిమా క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రిలీజ్ డేట్ తో పాటు వెంకీ కొత్త పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఒక ట్రక్ మీద బాంబులు పెట్టి.. వాటి పక్కనే గన్ పట్టుకొని కూర్చొని.. సీరియస్ లుక్ లో దర్శనమిచ్చాడు. బాంబ్ డిసెంబర్ 22 న పేలుతుంది అంటూ హింట్ ఇచ్చారు. పోస్టర్ ను బట్టి ఈ సినిమా వెంకీ ఫుల్ యాక్షన్ ఎంటర్ సీన్స్ లో అదరగొట్టినట్లు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమాలోకి అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి వెంకీ అభిమానుల అంచనాలను అందుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: