మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అనేక మూవీ లలో నటించిన విశ్వక్ తన కెరియర్ లో ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న యువ హీరో గా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా విశ్వక్ "దాస్ కా దమ్కి" అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. 

మూవీ లో విశ్వక్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ లో నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటించగా ... రావు రమేష్ ఒక ముఖ్య పాత్రలో నటించాడు. కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకొని మంచి కలెక్షన్ లను రాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర విజయవంతమైన మూవీ గా నిలిచింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితం నుండి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 100 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించింది. ఈ విషయాన్ని తాజాగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ అధికారికంగా ప్రకటించింది. ఇలా థియేటర్ లలో మంచి విజయం సాధించిన ఈ సినిమా ప్రస్తుతం "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: