తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి భారీ అంచనాల నడుమ విడుదలకు రెడీగా ఉన్న సినిమాలలో ఒకటి పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2. మొత్తంగా రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా యొక్క మొదటి భాగం పోయిన సంవత్సరం విడుదల అయింది. పోయిన సంవత్సరం మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ యొక్క మొదటి భాగం తమిళ సినీ ప్రేమికులను బాగానే అలరించినప్పటికీ మిగతా భాష సినీ ప్రేమికులను మాత్రం భారీ రేంజ్ లో అలరించ లేక పోయింది. దానితో ఈ సినిమా యొక్క తమిళ వర్షన్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నప్పటికీ ... మిగతా భాషల్లో మాత్రం ఈ మూవీ పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది.

మూవీ కి మణిరత్నం దర్శకత్వం వహించగా ... విక్రమ్ , జయం రవి , కార్తీ , ఐశ్వర్య రాయ్ ,  త్రిష ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఈ మూవీ యొక్క రెండవ బాగాన్ని ఏప్రిల్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. అందుకోసం ఈ మూవీ యూనిట్ ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ మొత్తం లో థియేటర్ లను కేటాయించింది. ఈ మూవీ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్ లలో విడుదల చేయబోతున్నారు తెలుసుకుందాం.

మూవీ నైజాం ఏరియాలో 115 థియేటర్ లలో విడుదల చేయనుండగా ... సీడెడ్ లో 40 థియేటర్ లలో ,  ఆంధ్ర లో 185 థియేటర్ లలో విడుదల చేయనున్నారు.  మొత్తంగా ఈ మూవీ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో 340 థియేటర్ లలో విడుదల చేయనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: