విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం సైన్ధవ్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి హిట్ ది ఫస్ట్ కేస్ ... హిట్ ది సెకండ్ కేస్ మూవీ లకు దర్శకత్వం వహించి దర్శకుడి గా తన కంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ను ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే ప్రారంభించింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ యొక్క షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. వైజాగ్ లో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా లోని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... రుహాని శర్మ ... ఆండ్రియా కీలక పాత్రలలో కనిపించ బోతున్నారు.

 ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కొన్ని పోస్టర్ లను విడుదల చేసింది. అందులో భాగంగా ఈ చిత్ర బృందం ఇప్పటి వరకు ఈ సినిమా నుండి వెంకటేష్ ... శ్రద్ధ శ్రీనాథ్ ... రుహాని శర్మ ... ఆండ్రియా ఫస్ట్ లుక్ పోస్టర్ లను విడుదల చేసింది. ఈ మూవీ లో శ్రద్ధ శ్రీనాథ్ ... మనోగ్యా పాత్రలో కనిపించనుంది. 

రుహాని శర్మ ... డాక్టర్ రేణు పాత్రలో కనిపించనుంది. ఆండ్రియా ... జాస్మిన్ పాత్రలో కనిపించనుంది. ఇలా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాల్లో కీలక పాత్రలో నటించిన వారి ఫస్ట్ లుక్ పోస్టర్ లను ఇప్పటికే విడుదల చేసింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: